ఎల్లారెడ్డిపేట మండలంలో విజృంభించిన కరోనా
20 కరోనా పాజిటివ్
84 మందికి నెగిటివ్
మండల వైద్యాదికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడి
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ఎల్లారెడ్డిపేట మండలంలో కరోనా విజృంభించింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బుధవారం 104 మందికి కరోనా నిర్ధారణ కోసం పరీక్షలు చేయగా 20 కరోనా పాజిటివ్ రాగా 84 మందికి నెగిటివ్ వచ్చినట్టు మండల వైద్యాదికారి డాక్టర్ ధర్మానాయక్ తెలిపారు. గర్జనపల్లి లో 5 గురికి.ఎల్లారెడ్డిపేటలో నలుగురికి .గొల్లపల్లి లో నలుగురికి. తిమ్మాపూర్ లో ఇద్దరి కి.నారాయణ పూర్ లో ఓకరికి. బండలింగంపల్లిలో ఓకరికి. ఆల్మాస్ పూర్ లో ఓకరికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ అయ్యిందన్నారు. కరోనా నిర్దారణ అయిన వ్యక్తులు కంట్రోల్ అయ్యేంతవరకు కుటుంబ సభ్యులకు దూరంగా మాస్కులు దరించి ఉండాలని . ప్రతి రోజు గోరువెచ్చని నీటినే తాగాలనీ ఆయన పిలుపునిచ్చారు. కరోనా సోకినట్టు అనుమానం ఉన్న వ్యక్తులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ధర్మానాయక్ కోరారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో కోవీడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం 47 మందికి కరోనా వాక్సిన్ వేసినట్లు డాక్టర్ ధర్మానాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాల వయస్సు పై బడిన ప్రతి ఒక్కరికీ ( దీర్ఘకాలిక వ్యాదులతో సంబంధంలేకుండా ) వాక్సిన్ ఇవ్వబడుతుందన్నారు. లబ్దిదారులు అందరు కూడా ఆధార్ కార్డ్ తో రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా సద్వినియోగపర్చుకోవాలనీ ధర్మానాయక్ కోరారు.
No comments:
Post a Comment