ఆరోగ్య హక్కు వారి నూతన నియామకం
పెన్ పవర్, మందమర్రిశనివారం రోజున ఆరోగ్య హక్కు వేదిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మందమర్రి పట్టణ అధ్యక్షుడు గా దుర్గం సతీష్ ను నియమించినట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది మోతే, రాజలింగు, తెలిపారు. ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతు ఆరోగ్య, హక్కుల ఉల్లంఘనలపై, పోరాడాలని ఆయన తెలిపారు వేదిక అభివృద్ధికి కృషి చేయాలని అని కోరారు. ఆహార కల్తీ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు ఆరోగ్యం మానవ హక్కు అని ప్రజలను చైతన్య వంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రజారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాజుల శంకర్ బాలకృష్ణ రమేష్ రాజా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment