కరోనా పై అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి.....
పెన్ పవర్, ఉలవపాడు
మండల కేంద్రమైన ఉలవపాడు లోని కరోనా పై అవగాహన ర్యాలీ మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పాల్గొని సచివాలయం 3 నుండి ర్యాలీ నిర్వహించారు, మెయిన్ రోడ్డు అంబేద్కర్ బొమ్మ సెంటర్ననుండి కృష్ణానగర్ పంచాయితీ కార్యాలయం దగ్గర నుండి స్టేట్ బ్యాంక్ వరకు కరోనా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది, అందులో భాగంగా ప్రతి షాపులో తనిఖీ నిర్వహించి వారికి మాస్ ధరించాలని భౌతిక దూరం పాటించాలని శానిటేషన్ వాడాలని మీ దగ్గరకు వచ్చే ప్రజలకు కూడా మాస్కు తప్పనిసరిగా ఉండాలని భౌతిక దూరం పాటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని అలాగే వాహనదారులకు మాస్కు ధరించకుండా రోడ్లపై తిరిగే వారికి మాస్కులుఅందజేసి జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు. అనంతరం మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక్క రోజులో పోయె ప్రయత్నం కాదని అందరూ సహకరించి కరోనా నియంత్రణకు పాటుపడాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్ ,మరియు వార్డ్ మెంబర్స్, పంచాయతీ కార్యదర్శి తో కలసి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు మమేకమై ఏ గ్రామం లోని వారు ఐక్యంగా ప్రజలకు కరోనాపై అవగాహన నాలుగు రోజులపాటు పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు, అప్పటికి మాస్కు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా శాటైజర్ వాడకుండా తిరిగి వారికి చట్టపరమైన చర్యలు చేపడతానని సంబంధిత అధికారులకు జరిమానా విధించి వారికి అవగాహన కల్పించాలి, పేకాట ఆడేవారు, కోడి పందాలు వేసేవారికి ఇకనుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టేషన్ బెయిల్ రద్దు చేయబడుతుంది.
ఇలాంటి వారికి సిఫారస్ చేసేవారికి కూడా హెచ్చరికగా మంచి పని కాదని వారిని కోర్టుకు హాజరు పరుస్తాం తఘు అధికారులకు రెవిన్యూ, డెవలప్మెంట్, అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు, పోలీసు వారు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు పాటించాలని, కరోనా సంబంధిత పంచాయతీలకు బ్లీచింగ్ సప్లై చేయబడుతుందని ఇది చాలకపోతే మరల బ్లీచింగ్ సప్లై చేస్తామని ఆయన వివరించారు, అలాగే అవసరమైన పంచాయతీలకు హైడ్రో సోడియం క్లోరైడ్ సప్లై చేయబడుతుందని ప్రతి ఒక్కరూ సెకండ్ వే కరోనా పై జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పీ డీ వో టి.రవి కుమార్, తాసిల్దార్ కె సంజీవరావు, ఎస్ ఐ పి విశ్వనాథరెడ్డి, ఈ ఓ పి ఆర్ డి ఎల్ . చెంచులక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బి. విజయమ్మ, వీఆర్వోలు ,సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచి మాణిక్యాల నాగలక్ష్మి,వైయస్సార్ సిపి నాయకులు రామాల సింగారెడ్డి, కొటు కోటిలింగం, వేమిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి, మల్లవరం సుబ్బారెడ్డి, బ్రహ్మయ్య, వెల్డింగ్ ఖాదర్ బాషా,వెంగళరావు, కీర్తి చిరంజీవి,కొటుకోటయ్య, వార్డ్ మెంబర్స్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment