పంటల బీమాకు అన్నదాతలందరూ బయోమెట్రిక్ను నమోదు చేసుకోవాలి
పెన్ పవర్, ఆలమూరు
ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్లోలోని ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం మండలాల్లో 2020వ సంవత్సరంలో ఖరీఫ్ పంటలకు సంబంధించి పంట భీమా కొరకు అన్నదాతలందరూ బయోమెట్రిక్ ను నమోదు చేయించాలని ఆలమూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏడీఏ సీహెచ్ కెవి చౌదరి అన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ రైతు భరోసా కేంద్రంలో (ఆర్బీకె) రైతుల నుండి బయోమెట్రిక్ నమోదు చేసుకుంటున్న విధానాన్ని తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఈ నెల 20వ తేదీ లోపుగా రైతుబరోసా కేంద్రాలలో బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటికే కొందరు రైతులు అందుబాటులో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్ద ఇప్పటికే 15707 మంది రైతులు బయోమెట్రిక్ వేయించుకోగా ఇంకా ఆలమూరులో 4600 మంది, మండపేటలో 7029 మంది, కపిలేశ్వరపురం మండలంలో 5268 మందిరైతులు తమ బయోమెట్రిక్కును నమోదుచేయించుకోవాల్సి ఉందన్నారు. మరికొందరు రైతులు వేరే ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గల అన్ని రైతు భరోసా కేంద్రాల్లో బయోమెట్రిక్ నమోదు చేసుకునే అవకాసం ఉందని చౌదరి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరు వినియోగించుకోవాలని ఏడిఏ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు వ్యవసాయశాఖ (ఏవో) అధికారిణి సోమిరెడ్డి లక్ష్మి లావణ్య, పలువురు వ్యవసాయశాఖ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment