చెన్నూర్ నియోజకవర్గం..!
చెన్నూర్ , పెన్ పవర్రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ నుండి చెన్నూర్ నియోజకవర్గం లోని పలు రోడ్లు మరియు బ్రిడ్జ్ లకు అనుమతులు మంజూరు అయినట్టు ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు తెలిపారు. అందులో భాగంగా.. మందమర్రి మండలం పాలచెట్టు నుండి అవదం వయా మామిడి గట్టు వరకు (14.97 KM)8.45 కోట్ల నిధులతో కొత్తరోడ్డుకు పంచాయితీ రాజ్ శాఖ నుండి అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు. తద్వారా మందమర్రి మండల పరిధిలోని 9 గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుఅవ్వనున్నది. చెన్నూర్ మండలం గంగారాం నుండి పొన్నారం వయా బీరవెల్లి రహదారిపై 1.97 కోట్ల నిధులతో బ్రిడ్జికి అనుమతి. చెన్నూర్ మండలం R&B రోడ్డు నుండి సుబ్రంపల్లి నుండి దుగునే పల్లి వయా నారాయణపూర్ రహదారిపై 4.80 కోట్లతో బ్రిడ్జ్ కు అనుమతులు మంజూరు అయినట్టు విప్ గారు తెలిపారు. వీలైనంత త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంత రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించుకొని పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.
No comments:
Post a Comment