Followers

ప్రజా పత్రిక ఎడిటర్ దేవీ సుదర్శన్ మరణం పట్ల ప్రెస్ క్లబ్ సంతాపం

 ప్రజా పత్రిక  ఎడిటర్   దేవీ సుదర్శన్ మరణం పట్ల ప్రెస్ క్లబ్ సంతాపం 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

    ప్రజా పత్రిక వారపత్రిక ఎడిటర్ సింహంభట్ల దేవీ సుదర్శన్ ఆకస్మిక  మరణం పట్ల చింతిస్తూ, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి అధ్యక్షతన ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం ఉదయం  సంతాప సభ  నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె చిత్రపటానికి సారధి తో పాటు క్లబ్ గౌరవ అధ్యక్షుడు మండేలా శ్రీరామ మూర్తి,  సీనియర్ పాత్రికేయులు వి ఎస్ ఎస్ కృష్ణకుమార్, ఏ ఆర్ వి సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్,  ఎన్టీవీ శ్రీనివాస్, విశ్వనాధ్, రాఘవరావు ,ఈశ్వరరావు, మధు, దివాకర్ల ఆనంద్, కృపానందం, స్టార్ మురళి, కె మధు , రమేష్, తిరుమల, ఆర్కే,  ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ  తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మ శాంతికోసం రెండు నిముషాలు మౌనం పాటించారు.  విలువలతోవారపత్రిక నడుపుతూ దేవి సుదర్శన్ ఆదర్శంగా నిలిచారని, సంచలనాల కంటే నిజమైన వార్తకు విలువ ఇచ్చారని పలువురు పేర్కొన్నారు.  అందరితో, కలివిడిగా, కలుపుగోలు తనంగా ఉంటూ ఎందరికో ఆత్మీయులయ్యారని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...