Followers

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం...


ఆదిలాబాద్ ,  పెన్ పవర్

ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి   నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ప్రతిక్షణం కోవిడ్ రోగుల పరిరక్షణ కోసం  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు.స్థానిక శాంతినగర్ లో బుధవారం కొవిడ్ కంట్రోల్ రూమ్ ను పార్టీ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్ పదిమంది సభ్యులు ఉంటారని, వారు మూడు షిఫ్ట్ లు వారీగా పని చేస్తారన్నారు. ప్లాస్మా, ఆక్సిజన్, హాస్పిటల్లో బెడ్లు, వెంటిలేటర్లు, మెడిసిన్ లాంటి సంబంధించిన సేవలు అందుబాటు లో ఉంటాయని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా ఈ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్, చరణ్ గౌడ్, చంద్రాల రాహుల్, రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...