తెలంగాణ ప్రభుత్వం తో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది...
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
టిఆర్ఎస్ పార్టీలో చెరిన పలువురు.
ఆదిలాబాద్ , పెన్ పవర్
గ్రామాలను అభివృద్ధి పథంలో నడుపుతూ మౌలిక వసతులను కల్పించడంతో సహా ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని రామాయి గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో పలువురు నాయకులు, గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. పార్టీ లో నూతనంగా చేరిన వారికి గులాబి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకుల జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ గ్రామాల అభ్యున్నతి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గతంలో కనీస మౌలిక వసతులు కరవై, ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీ లకు చెందిన నేతలు టిఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రానున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఆరె నరేష్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి కేవలం తెరాస తోనే సాధ్యమవుతుందన్న ఎమ్మెల్యే అందుకు అనుగుణంగా విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జెడ్పీటీసీ అభ్యర్థి ఆరే నరేష్, నాయకులూ జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment