గోదావరిలో ప్రమాదవశాత్తూ హాస్టల్ విద్యార్థి మృతి
రాజమహేంద్రవరం, పెన్ పవర్
గోదావరి నది పుష్కర ఘాట్ లో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన హాస్టల్ విద్యార్థి బొబ్బర్ల చంద్ర గణేష్ (16) కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు సహాయ మందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. శుక్ర వారం ఉదయం రాజేంద్ర నగర్ లో ఉన్న కళాశాల వసతి గృహానికి సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జే. రంగ లక్ష్మీదేవి వస్తున్నారన్న సమాచారంతో సీపీఐ, సామాజిక హక్కుల వేదిక (ఎస్ సి, ఎస్ టి, బీసీ ఫోరం), ఏఐఎస్ఎఫ్ చేరుకుని జెడిని విద్యార్థులతో కలిసి ముట్టడించారు. విద్యార్ధి కుటుంబాన్ని తక్షణం ఆదుకోవాలని కోరారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి మృతి ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా మీరు నోట్ తయారు చేయాలని ప్రభుత్వం నుంచి సహాయం చేయకపోతే వారి కుటుంబం రోడ్డున పడుతుందని ఆయన అన్నారు.అంతేకాకుండా ఎన్నికల డ్యూటీలుకు హాస్టల్ వార్డెన్ లను హాస్టల్ సంక్షేమ అధికారులును వేయకూడదని ఇందులో ఏ.ఎస్.డబ్ల్యూ,ఓ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మధు ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్థాయిలో మెజిస్ట్రేట్ విచారణ జరిపి ప్రభుత్వం నుండి సహాయం అందించాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని దీనికి కి విద్యార్ధి రాజానగరం నియోజక వర్గానికి చెందినవారు కావడంతో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు మరియు సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ మహేష్ విద్యార్థులు రాజేష్ , కన్నా రావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment