Followers

మాస్కులు ధరించి కరోనా కట్టడికి కృషి చేయాలి

 మాస్కులు ధరించి కరోనా కట్టడికి కృషి చేయాలి...

  -జడ్పిటిసి చారులత రాథోడ్

ఉట్నూర్, పెన్ పవర్

ప్రతి ఒక్కరు మాస్కులను ధరించి కరోనా కట్టడికి కృషి చేయాలని ఉట్నూర్ జడ్పిటిసి చారులత రాథోడ్ అన్నారు. శుక్రవారం  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అని మాట్లాడుతూ  ఉట్నూర్ లో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతున్న తరుణంలో  ప్రతి ఒక్కరు మాస్కులను ధరించి కోవిడ్ నిభందనలు పాటించాలని సూచించారు.అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని ఇళ్ళలోనే ఉండాలని విఙ్ఞప్తి చేశారు. 45 ఏళ్ళు నిండిన వారు ఖచ్చితంగా  ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టికాలను వేసుకోవాలని కోరారు.ఉట్నూర్ మండల కేంద్రంలోని వారు ఉట్నూర్ సి.హెచ్.సి. ఆసుపత్రిలో మండలంలోని ఇతర ప్రాంతాల వారు శ్యాంపూర్, హస్నాపూర్, దంతన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోకి వెళ్ళి కోవిడ్ టీకాలను వేసుకోవాలని సూచించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...