అనుమతి లేని డయాగ్నోసిస్ సెంటర్లను సీజ్ చేయాలి.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ కి వినతి.
తొర్రూరు, పెన్ పవర్పట్టణ కేంద్రంలో ఉన్న డయాగ్నసిస్ సెంటర్లు అనుమతులు లేకుండా నడిపిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, వైద్య శాఖ అధికారులు అనుమతులు లేకుండా నడిపించే డయాగ్నోసిస్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలని, మహబూబాద్ జిల్లా తొర్రూరు ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు మాలోత్ సురేష్ బాబు, లవిశెట్టి ప్రసాద్ లు డిమాండ్ చేశారు.జిల్లా ఉప వైద్య అధికారి కార్యాలయంలో అనుమతులు లేకుండా నడిపించే డయాగ్నోసిస్ సెంటర్లను తనిఖీ చేసి, వాటిని సీజ్ చేయాలని,సోమవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మాలోతు సురేష్ బాబు, లవిషెట్టి ప్రసాద్ మాట్లాడుతూ... తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న డయాగ్నోసిస్ సెంటర్లపై వైద్యాధికారులు ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని డయాగ్నోసిస్ సెంటర్లను సీజ్ చేయాలన్నారు. తొర్రూరు పట్టణంలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా పెరిగిపోతున్న డయాగ్నసిస్ సెంటర్లపై సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తొర్రూరు మండలంలో విచ్చలవిడిగా నూతన డయాగ్నసిస్ సెంటర్లు ఏర్పడుతున్నాయని, డయాగ్నోసిస్ సెంటర్లలోనూ రక్తపరీక్ష చేయు సంబంధించిన పరికరాలు సరిగ్గా లేవని, ఇష్టం వచ్చినట్టు రక్త పరీక్షల రిపోర్టులు ఇస్తున్నారని, పేషెంట్లు అడిగి రిపోర్టులు ఇస్తున్న సందర్భాలున్నాయన్నారు. ఏ సమస్యలు లేకపోయినా హాస్పిటల్ యాజమాన్యంతో కుమ్మక్కై తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, విమర్శించారు. డయాగ్నసిస్ సెంటర్లో యజమాన్యం హాస్పిటల్ యాజమాన్యంతో కుమ్మక్కై తప్పుడు రిపోర్టులు ఇవ్వడం వల్ల హాస్పిటల్ లో అడ్మిట్ కావాల్సి వస్తుందన్నారు. అడ్మిట్ అయిన పేషెంట్ మీద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, విమర్శించారు. ఇలాంటి తప్పుడు రిపోర్టులు ఇవ్వడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ కావలసిన పరిస్థితులు పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు ఆవేదన వ్యక్తం చేశారు.పట్టణంలో ఉన్న డయాగ్నసిస్ సెంటర్లలో ఒక్కో సెంటర్లలో ఒక్కో ధరల పట్టిక ఉందని, అన్ని డయాగ్నసిస్ సెంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా నడిపిస్తున్న డయాగ్నసిస్ సెంటర్లపై, తప్పుడు రిపోర్టులు ఇస్తున్న డయాగ్నసిస్ సెంటర్లపై, అధిక ధరలు తీసుకుంటున్న డయాగ్నసిస్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను కోరారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి, ప్రజా సంఘాలను ఏకంచేసి, జిల్లా వైద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు అజిత్,అమీర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment