శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం...
ఇంద్రవెల్లి, పెన్ పవర్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనగ కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ ప్రారంభించారు.ముందుగా కంటాకు మండల ప్రజాప్రతినిధులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం శనగ కొనుగోళ్ళను ప్రారంభించారు. తోలుత మొదటి రైతును శాలువాతో సత్కరించారు. అనంతరం ఇంద్రవెల్లి మరియు సిరికొండ మండలాలలోని 30 మంది అర్హులైన లబ్బిదారులకు మంజురైన కళ్యాణ లక్ష్మి చెక్కులను వారికి అందజేశారు.ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ మాట్లాడుతు తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు అండగా ఉంటు రైతు బందు రైతు భీమాతో పాటు నేడు రైతులు పండించిన పంటలను సైతం కొనుగోలు చేస్తు అదుకుంటున్నారని, నేడు ఇంద్రవెల్లిలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మండల రైతుల శనగలను కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇక మరోపక్కా నేడు ఇంద్రవెల్లి మండలానికి చెందిన 27 మందికి, సిరికొండ మండలానికి చెందిన (3) ముగ్గురికి మొత్తం 30 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించడం జరిగిందని, పుట్టిన ఆడబిడ్డ నుండి వారి పెళ్ళిళ్ళ వరకు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని, కేసిఆర్ కిట్ తో పాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను ఆడపడుచులకు అందిస్తు ఆదుకుంటున్నారని, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలందరికి అందిస్తు ముఖ్యమంత్రి కేసిఆర్ అందరి బాందవుడిగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి సర్పంచ్ కొరెంగ గాంధారీ, జడ్పిటిసి అర్క పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాథోడ్ మోహన్, ఇంద్రవెల్లి-ఉట్నూర్ పిఎసిఎస్ చైర్మెన్లు మారుతి డోంగ్రే, ఎస్పి రెడ్డి, జడ్పి కో ఆప్షన్ సభ్యుడు అంజద్, ఇంద్రవెల్లి-ఉట్నూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెందూర్ హరిదాస్, అజిమొద్దీన్, ఎంపిటిసిలు స్వర్ణలత మహెష్ కదం, అశాబాయి, పిఎసిఎస్ డైరెక్టర్ దిలిప్ మోరే, ఉప సర్పంచ్ టెహెరె గణేష్,మార్క్ ఫేడ్ డిఎం పుల్లయ్య, ఏఓ రాథోడ్ గణేష్, పిఎసిఏస్ సిఈఓ ధరమ్ సింగ్, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment