బయట ఆహ్లదకరం - లోపల సమస్యల తాండవం
ఫ్యానులు తిరగక ఉక్కపోతతో రోగులు ఉక్కిరిబిక్కిరి
భద్రగిరి సి.హెచ్.సీ లో ఉట్టిపడుతున్న నిర్వహణ లోపం
గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్
గుమ్మలక్ష్మీపురం మండలంలో ఏకైక సామాజిక ఆరోగ్యకేంద్రం భద్రగిరి ఆరోగ్య కేంద్రం. మండలంలోని 27 పంచాయతీల ప్రజలకు ఆరోగ్య సమస్య వస్తే వైద్యం అందించవలసిన ఆసుపత్రిలో అడుగు పెట్టాలంటే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి .అనారోగ్యముతో వచ్చిన బాధితులకు వైద్యం ఎంత అవసరమో దానితో పాటుగా మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యం. కానీ అటువంటి సదుపాయాలు ఏవి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కానరావడం లేదు.సుమారు 300 మంది వరకు అవుట్ పేషేంట్స్ వస్తూ ఉంటారు. అవుట్ పేషేంట్స్ కన్నా ఆసుపత్రిలో ఉండి వైద్యం తీసుకోవలసిన రోగుల (ఇన్ పేషేంట్స్) పరిస్థితి మాత్రం వర్ణనాతీతం.వార్డు లోకి వెళ్లిన రోగులకు సమస్యలు స్వాగతమిస్తాయి. ప్రతీ వార్డులో ఫ్యానులు ఉన్నా అవి పనిచేయకపోవడంతో రోగులు ఉక్కపోతతో పట్టపగలే చుక్కలు చూస్తున్నారు.

No comments:
Post a Comment