Followers

ప్రభుత్వ ఆసుపత్రి , ఎన్ 95 మాస్కులు. పీ పీ కిట్లు పంపిణీ..సతీష్ బాబు

 ప్రభుత్వ ఆసుపత్రి , ఎన్ 95 మాస్కులు.  పీ పీ కిట్లు పంపిణీ..సతీష్ బాబు 

 పెన్ పవర్,  కాప్రా

కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తున్న  డాక్టర్లు మరియు సిబ్బంది కి  ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ డాక్టర్ ఏ.  ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు నీరు కొండ సతీష్ బాబు ఆధ్వర్యంలో కోవిడ్ టెస్టుల ను మరియు వాక్సినేషన్ చేస్తున్న వైద్య సిబ్బందికి N 95 మాస్క్ లు, పీ పీ కిట్లను  అందజేయడం  జరిగింది. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో దశ కరోన విజృంభించడంతో   ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు వందల సంఖ్యలో పేషెంట్ వస్తున్నారని డాక్టర్లు నర్సులు వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్క్లను భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు‌.  ఈ కార్య్రమంలో కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు సంపత్ స్వప్న రెడ్డి , నాయకులు ఎస్. ఏ.  రహీం, బిజెపి నాయకులు టీ మహేష్,  ఉప్పల్ మానవహక్కుల సంఘం అధ్యక్షులు గగన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...