Followers

ఏరియాలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి

 ఏరియాలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి

--ఏరియా జిఎం చింతల శ్రీనివాస్


పెన్ పవర్,  మందమర్రి 

మందమర్రి ఏరియాలో ఏప్రిల్ మాసంలో  94 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిఎం కార్యాలయం లో ఏప్రిల్ మాసం రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, కరోన కు సంబంధించిన అంశాలను వీడియో ద్వారా విలేకర్లకు తెలియపరిచారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ మాసంలో ఏరియాలోని కేకే 1 గని 104శాతం, ఆర్కేపి ఓసిపి గని 125 ఉత్పత్తి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ మాసంలో  ఏరియాలోని  కేకే-1 గని 104శాతం ఉత్పత్తి సాధించగా,కేకే-5 గని 83శాతం,ఆర్కే 1ఎ గని 87శాతం,కాసిపేట గని 61శాతం, కాసిపేట-2 గని 46శాతం, శాంతిఖని గని 50శాతం, కేకే ఓసిపి 95శాతం, ఆర్కే ఓసిపి 125శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. మార్చి నెలలో భూగర్భ గనుల ద్వారా 72 శాతం ఉత్పత్తి సాధించగా, ఓసిపి ల ద్యారా 102 శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. ఏప్రిల్ మాసంలో 2.25 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా, రైలు మార్గం ద్వారా 53 రేకులతో 2.14 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు,28.34 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏరియాలో సింగరేణి కార్మికులకు కరోనా వైరస్ బారిన పడితే  చికిత్స అందించేందుకు రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, ఐసొల్యూషన్ రెండు విభాగాల్లో 103 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా క్వారెంటైన్ కేంద్రాలు ఆర్కేసిఎంఓ క్లబ్ 70,కమ్యూనిటీ హాల్ 40 మొత్తం 110 అందుబాటులో ఉన్నాయని,కరోనా ను ఎదుర్కొంనెందుకు  ఏరియాల్లో మొత్తం 213 బెడ్లు అందుబాటులో ఉంచినట్లు,ఆక్సిజన్ సిలిండర్లు, మందులు కూడా సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. ఏరియా ఏరియా ఆస్పత్రిలో చేపట్టిన చర్యల పై సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఏరియాలో కరోన వ్యాక్సినేషన్ ప్రక్రియ 22% అయిందని మే 31 వరకు 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  మే 1 నుండి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మికులు కరోనా వ్యాక్సిన్ అపోహలు వీడి వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోన వైరస్ బారినపడిన ప్రాణాపాయం నుండి బయట పడవచ్చని ఆయన సూచించారు.గనులలో కరోన నివారణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కార్మికులు సైతం పని స్థలాల్లో, ఇంటి వద్ద, బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావాలని, డ్యూటీకి, ఇంటికే పరిమితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఇంచార్జ్ పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాం సుందర్, డివైఎస్ఈ (ఐఈ) ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...