కె.జి.హెచ్ లో,డివి.సుబ్బారావు 90వ జయంతి వేడుకలు
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ మాజీ మేయర్ డివి సుబ్బారావు 90వ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో కేజీహెచ్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.మైధిలి విచ్చేసి డివీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా రెండవ దశ తీవ్రంగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం కేజీహెచ్ వైద్యులకు, సిబ్బందికి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ కే హరిబాబు సహకారంతో పీపీఈ కిట్లు అందించారని తెలిపారు.కరోనా తీవ్రతను మనోధైర్యంతో ఎదుర్కోవాలని కోరారు.వైద్యులు ,వైద్య సిబ్బంది రోగులను కాపాడటానికి ప్రతీ క్షణం కృషి చేస్తున్నారన్నారు.కేజీహెచ్ లో రోగుల కోసము 500 పడకలు ఉన్నాయని ,సమృద్ధిగా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయన్నారు.ప్రజలందరూ కోవిడ్ టీకా తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.అవసర సమయంలో పీపీఈ కిట్లు అందచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నగర బిజెపి అధ్యక్షుడు ఎమ్.రవీంద్రారెడ్డి మాట్లాడుతూ మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు వయస్సు వారికి టీకా కు కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చిందన్నారు.ప్రజలందరూ మాస్కులు ధరించి,భౌతిక దూరం పాటించాలని తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.రద్దీ ప్రాంతములలో తీరగరాదని సూచించారు.డివి సుబ్బారావు విశాఖ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.బిజెపి వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రధాని మోడీ పిలుపు నందుకుని బిజెపి కార్యకర్తలందరూ ప్రజలకు సేవలందిస్తున్నారని, కరోనా ను కట్టడి చేయడంలోకృషి చేయుచున్న వైద్యులు,వైద్య సిబ్బంది,పారిశుద్ధ్య సిబ్బంది,పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బిందు మాధవి,డాక్టర్ నవీన్,డాక్టర్ వై లక్ష్మణ్ రావు మరియు బీజేపీ నేతలు పల్లా చలపతిరావు,ఎస్సీ మోర్చ నాయకుడు చుక్కాకుల రాంబాబు,జగదీష్,గేదెల శ్రీహరి,కేజీ హెచ్ సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీకాంత్,దుర్గా ప్రసాద్ ఇంకా అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొని డివి సుబ్బారావు కు ఘన నివాళులర్పించారు.
No comments:
Post a Comment