70మందికి రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్
తవణంపల్లి మండల పరిధిలోని నల్లి శెట్టిపల్లి సచివాలయం నందు శుక్రవారం 70 మందికి రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి దత్తాత్రేయ తాసిల్దార్ హనుమంతు ఎంపీడీవో ధనలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో కరోనా కట్టడికి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సబ్బుతో తరచు చేతుల శుభ్రత శానిటైజర్ తో చేతుల శుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత ప్రతి ఒక్కరూ తన్నుతాను రక్షించుకొని కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ రచ్చబండ దగ్గర గుంపులు గుంపులుగా ఉండరాదని ప్రభుత్వ అధికారులు సూచనలు సలహాల మేరకు నిబంధనలు పాటించాలని 45 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందులు హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం రెడ్డి సి హెచ్ వో రమాదేవి సూపర్వైజర్లు రాజశేఖర్ జయమ్మ అపంచాయతీ కార్యదర్శి రామకృష్ణ వాలంటీర్లు ఆశ కార్యకర్తలు సర్పంచి ఎంపీటీసీ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment