Followers

ఏరియాలో 62 శాతం బొగ్గు ఉత్పత్తి

ఏరియాలో 62 శాతం బొగ్గు ఉత్పత్తి

--ఏరియా జిఎం చింతల శ్రీనివాస్

మందమర్రి,  పెన్ పవర్

మందమర్రి ఏరియాలో మార్చి మాసంలో  62 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,మార్చి మాసంలో ఏరియాలోని ఆర్కే 1ఎ‌,కేకే 1,కేకే ఓసిపి గనులు వంద శాతం ఉత్పత్తి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.మార్చి మాసంలో  ఏరియాలోని  కేకే-1 గని 105శాతం ఉత్పత్తి సాధించగా,కేకే-5 గని 79శాతం,ఆర్కే 1ఎ గని 100శాతం,కాసిపేట గని 52శాతం,కాసిపేట-2 గని 17శాతం,శాంతిఖని గని 35శాతం,కేకే ఓసిపి 121శాతం, ఆర్కే ఓసిపి 22శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఏరియా 49శాతం ఉత్పత్తి సాధించిందని, ఉత్పత్తి వివరాలను తెలియజేశారు.మార్చి నెలలో భూగర్భ గనుల ద్వారా 52 శాతం ఉత్పత్తి సాధించగా, ఓసిపి ల ద్యారా 65 శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు.2020-21 ఆర్థిక సంవత్సరంలో  నిర్దేశిత లక్ష్యానికి కేకే-1 గని 66శాతం,కేకే-5 గని 60శాతం,ఆర్కే 1ఎ గని 64శాతం,కాసిపేట గని 43శాతం,కాసిపేట-2 గని 25శాతం,శాంతిఖని గని 39శాతం,కేకే ఓసిపి 77శాతం, ఆర్కే ఓసిపి 27శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయని వివరించారు.2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యంలో భూగర్భ గనుల ద్వారా 46 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగా, ఓసిపి ల ద్యారా 49 శాతం ఉత్పత్తి  లక్ష్యాన్ని సాధించి,2020-21 ఆర్థిక సంవత్సరానికి ఏరియా 49శాతం ఉత్పత్తి సాధించిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  ఏరియా  ఇంజనీర్, ఏజిఎం జగన్మోహన్ రావు,ఐఇడి(డిజిఎం) రాజన్న,పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, డివైపిఎం శ్యాం సుందర్,సీనియర్ పిఓ  సత్యబోస్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...