Followers

516 రహదారిలో నష్టపోయిన వారికి ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తాం

 516 రహదారిలో నష్టపోయిన వారికి ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తాం

పెన్ పవర్, విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో  516 రహదారి నిర్మాణం లో ఇళ్లు భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వంతో చర్చించి నష్ట పరిహారం  అందేలా చర్యలు తీసుకుంటామని  అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి  పాడేరు ఎమ్మెల్యే   కోట గుళ్ళు భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం  పాడేరు ఆర్ డి ఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి  శృంగవరపుకోట  అనంతగిరి అరకు  డుంబ్రిగూడ  హుకుంపేట పాడేరు చింతపల్లి  సీలేరు మీదుగా రాజమండ్రి వరకు 516 జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల డబ్భై కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.516 జాతీయ రహదారి నిర్మాణానికి ప్రస్తుత ఆర్ ఎన్ బి రహదారికి ఇరువైపులా  భూ సేకరణ జరుగుతుంది. పాడేరు ఆర్డిఓ  లక్ష్మీ శివ జ్యోతి   ఆధ్వర్యంలో  భూసేకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.  అనంతగిరి లంబసింగి తదితర ప్రాంతాల్లో రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని ఇవ్వటానికి రైతులు నిరాకరిస్తున్నారు. జాతీయ రహదారి  పనులకు ఆటంకం కలవకుండా  రైతులు సహకరించాలని  అధికారులు కోరుతున్నారు. సెక్స్ అయితే చిన్నాచితకా గల భూమిని వదులుకోలేము అని గిరిజనుల తెగేసి చెబుతున్నారు. దీనిపై స్పందించిన పార్లమెంట్ సభ్యురాలు మాధవి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి భూములు కోల్పోతున్న గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన న్యాయం చేస్తామని  పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...