Followers

బాధిత జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

 బాధిత జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా  ప్రకటించాలి : జాట్


వికారాబాద్ ,  పెన్ పవర్

విధి నిర్వహణలో భాగంగా కోవిడ్   బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తరహా ఎక్స్గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ  జాట్ రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర  పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని అంతటినీ పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తో కూడిన ఆర్థిక సహాయం చెల్లించాలని బాలస్వామి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సులతో మొదలుకొని ఉన్నతాధికారులు మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని పేర్కొన్నారు. కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని,జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు.  వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జాట్ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జాట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర గౌడు అధ్యక్షతన  జరిగిన సమావేశానికి వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి అడ్వకేట్ జేఏసీ అధ్యక్షులు అనంద్ గౌడు  డు మరియు వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులు ఆంజనేయులు  హాజరయ్యారు. ఈ సందర్భంగా సదానంద రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వాలు బాసటగా నిలవాలని సూచించారు. సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజల పక్షాన నిలబడే జర్నలిస్టుకు న్యాయం చేయాలన్నారు. కవి గాంచని చోటును కూడా జర్నలిస్టు సందర్శించి  సమస్యను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం విలేకరులు చేస్తారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మొదలుకొని  అనేక రంగాల్లో జర్నలిస్టుల సేవలు చిరస్మరణీయం అని హాజరైన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ విద్య వైద్య సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సమావేశం ప్రారంభానికి ముందు ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు.  సమావేశం అనంతరం ఇటీవల విధులు నిర్వహిస్తూ చనిపోయిన జర్నలిస్టు సోదరుల ఆత్మకు శాంతి కలగాలని, వారి సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నర్సింలు రాజేశ్వర్ రాఘవేంద్ర చారి పవన్ వన్ గేమ్ రెడ్డి సాయి చాంద్ పాషా  బిజెపి  జిల్లా కార్యదర్శి  హరికృష్ణ మండల అధ్యక్షులు బిజెపి ఆంజనేయులు పెంటయ్య గుప్తా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...