వాడపల్లి వెంకన్న నకు లక్షా 50 వేలు రూపాయలు విరాళం
పెన్ పవర్, ఆత్రేయపురం
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు అందులో ఒక భక్తుడు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెం గ్రామానికి చెందిన కరుటూరి సూర్య భాస్కర్ రావు కృష్ణవేణి దంపతులు 1,00,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన వేగేశ్న మనోజ్ వర్మ లలితా దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టు 50,000వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు వీరిద్దరిని దేవస్థానం రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment