బస్ షెల్టర్ కు, 5 రూ. భోజనం సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ లోని లాస్ట్ బస్టాప్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని, 5 రూపాయల భోజనం సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే వివేకానందకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.. ప్రజల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే త్వరలోనే రూ.5 భోజనం సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడప శేషు, పద్మజ రెడ్డి, శ్రీకాంత్, నాగిరెడ్డి, పద్మలత రెడ్డి, నాని, అడప శేఖర్, బద్రి, సురేష్ తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment