4వ వార్డులో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయించిన కౌన్సిలర్...
పెన్ పవర్, మేడ్చల్రోజు రోజుకు కరోన సెకండ్ వేవ్ విజృబింస్తున వేళా ప్రజల ఆరోగ్యని దృష్టిలో ఉంచుకుని కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, సహకారంతో కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో 4 వ వార్డులో హైడ్రో క్లోరిన్ ఆమ్లని, పిచికారి చేయించారు. ఈ సందర్భంగా 4 వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోన వైరస్ సెకండ్ వేవ్ ప్రబలుతున్న వేళా అనేక మంది ప్రాణాలు తీస్తున్న మనం కరోన వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరమైతే తప్పా ఇంట్లో నుండి బయటకు రాకూడదు అలాగే ఎల్లప్పుడూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ వాడాలని ముఖ్యంగా చిన్నపిల్లలు వయసు పైబడిన వాళ్ళు వైరస్ అధికంగా సోకే లక్షణాలు ఉన్నందున వారు బయటకు రాకుండా చూడాలని అలాగే షాపు యజమానులు శానిటైజర్ వాడుతు వినియోగదారులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించినవారికి మాత్రమే సరుకులు ఇవ్వాలని లేదా షాపు యజమానులకు జరిమానా విధించబడుతుంది అని కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు.
No comments:
Post a Comment