జనసేన పార్టీ ఆధ్వర్యంలో 42వ డివిజన్ లో ఉగాది వేడుకలు
విజయనగరం,పెన్ పవర్
ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేనపార్టీ సీనియర్ నాయకులు,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణరావు(బాలు) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న 42వ డివిజన్, ఎస్సి కాలనీలో ఉగాది వేడుకల్ని నిర్వహించారు. ప్రజలకు ఉగాది సందర్భంగా మామిడి కాయలు,బెల్లం,వేప పువ్వు పంచడం జరిగింది. అలాగే ప్రవాస(NRI) జనసేన కార్యకర్తలు పంపిన తెలుగు కేలండర్ ను కూడా ప్రతీయింటికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు, ఆదాడ మోహనరావు పాల్గొన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా ఎంతో మంది తెలుగు ప్రజల్లో ఉగాది సంతోషాన్ని నింపలేదని అన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలు కూడా జనాల్లో ఆందోళనను కలిగిస్తుందని అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చి ఉంటే బాగుండేదని, గృహిణికి నెలకు 3 వేలకు పైగా ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తూ.. వంట వండుకునేందుకు గ్యాస్ సిలండర్ కూడా ఉచితంగా ఇస్తామన్న జనసేనను గెలిపించకుండా ప్రజలు ఈరోజున చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు.ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అయినా కరోనా పట్ల జాగ్రత్తలు వహిస్తూ ప్రజలు ఆనందంతో,ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దంతులూరి రమేష్ రాజు, పిడుగు సతీష్, నలమరాజు, సురేష్,రమేష్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment