Followers

ఘనంగా కైలాసనాధస్వామి దేవాలయ 38వ వార్షికోత్సవం

 ఘనంగా కైలాసనాధస్వామి దేవాలయ 38వ వార్షికోత్సవం

గుమ్మలక్ష్మీ పురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల కైలాసనాధ స్వామివారి దేవాలయ వార్షికోత్సవం అంగరంగవైభవంగా జరిగింది.దేవాలయాన్ని ప్రతిష్టించి 38వసంతాలు పూర్తయిన సందర్భంగా గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ.గౌరీశంకర్ అధ్యక్షతన ఆలయ కమిటీ సభ్యులు,దోస్త్ మేరా దోస్త్ సభ్యులు  గుడిలో ప్రత్యేక పూజలను ఏర్పాటు చేసారు. పూజల అనంతరం ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో  ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ గౌరవ  అధ్యక్షులు మండంగి ప్రసాదరావు, కొత్తకోట.విష్ణు,ఉపాధ్యక్షుడు పైడా. నాగేశ్వరరావు,గ్రామ ఉపసర్పంచ్ కొత్తకోట కిషోర్, వైసీపీ పార్టీ నాయకులు నిమ్మక.శేఖర్, ఎద్దు. మురళీ తో పాటుగా కమిటీ సభ్యులు (మహా శివుని నిరంతర సేవకులు),గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తి దృశ్య యాత్ర కార్యక్రమాలు రద్దు:

కైలాసనాధ వార్షికోత్సవంలో గత పదేళ్లుగా పెద్దఎత్తున యాత్రకార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యాత్రకు మండలంలోని ప్రజలే కాకుండా ఇతర మండలాల నుండి,ఒరిస్సా ప్రాంతం నుండి వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో యాత్రను నిర్వహించడం ప్రమాదకరమని యాత్ర కార్యక్రమాలను నిలిపివేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి కరోనా వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు పాటించాలని గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ,గౌరీశంకర్ తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...