Followers

38వ వార్డు లో బోదిలపాటి ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా దోమతెరలు పంపిణీ

38వ వార్డు లో బోదిలపాటి ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా దోమతెరలు పంపిణీ

మహారాణి పేట, పెన్ పవర్

కరోనానివారణకు మాస్కులు ధరించిన విధంగా జ్వరాల నివారణకు దోమతెరలు వాడాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 38వ వార్డు వై.ఎస్.ఆర్.పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్  బోదిలపాటి ఉమామహేశ్వర రావు వారి సతీమణి సత్య రూపవాణి, వార్డు అధ్యక్షులు ఎస్.సన్యాసి రావు కలసి ప్రజలకు దోమతెరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలం ఒకవైపు కరోనాతో పాటు మరోవైపు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, దీనీ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు.డెంగీ,మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా దోమతెరలు ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ దోమ తెరలను ప్రత్యేకమైన రసాయనాలతో తయారు చేశారని, దోమలు వీటిపై వాలిన వెంటనే చనిపోతాయిని తెలిపారు.రెండో దశ కరోనా ప్రభావం అధికమవుతుందని, కనుక ప్రజలందరూ భౌతిక దూరం  పాటిస్తూ,మాస్కులు,శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని బోదిలపాటి ఉమామహేశ్వర రావు ప్రజలకు సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్ పి కోట కాత్యాయని సీనియర్ నాయకులు పోలవరపు సత్యనారాయణ మరియు వెంకటగిరి నాగరాజు,కోట రమేష్, పెదగాడి బాబ్జి,పాటోజు ప్రసాదు గా,పిల్లా అప్పారావు, చినబాబు, పాటోజు నాని,సిటీ మోటర్ వెంకటేశ్వరరావు,శ్యామల,గోర్స నానాజీ,బిళ్ళకుర్తి రాము,అయ్యప్ప శర్మ,కోసూరు సురేష్, కోసూరు శ్రీను,పాటోజు అర్జున్ ప్రసాద్,గోర్స గణేష్,వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...