Followers

35 వసంతాలు పూర్తి చేసుకున్న వివేకానంద సాంస్కృతిక సమితి

 35 వసంతాలు పూర్తి చేసుకున్న వివేకానంద సాంస్కృతిక సమితి

 1985 సంవత్సరములో స్థాపించబడి 1987సంవత్సరం ప్రభుత్వ గుర్తింపు
 ప్రతిభను ప్రదర్శించడానికి ఏర్పాటుచేసిన' కృష్ణరాయ కళావేదిక 
 శ్రీరామగిరి అనగానే గుర్తుకొచ్చేది శ్రీ రామ కళ్యాణం
 ఎంతోమంది కళా మేధావులను సన్మానించిన సమితి
నెల్లికుదురు, పెన్ పవర్

 మనకు వారసత్వంగా లభించిన సభ్యత, సంస్కారంలను, ఆచార వ్యవహారములను మన సమాజం దాదాపుగా మరచిపోయే స్థితికి చేరుకున్నది. అంతేగాక అనురాగం, ఆత్మీయత, జాలీ, దయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లాంటి శాశ్వతమైన విలువలను భవిష్యత్ తరాలకు ప్రస్తుత సమాజం అందించలేకుండా పోతుంది. ఈ సంస్కారాలన్నింటిని మన పూర్వీకులు కళారూపాల ద్వారా ముందు తరాలకు అందించే వారు. వాటిలో ప్రధానమైన "కళారూపం" జానపదం. అంతరించిపోతున్నటువంటి ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయ కళా రూపమైనా జానపద కళారూపాలను ప్రదర్శనల ద్వారా ప్రోత్సహిస్తూ పరిరక్షించాలి అనే ఉద్దేశంతో 36 సంవత్సరాల క్రితం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీ రామగిరి గ్రామంలో ఉభయవేదాంత ప్రవీణ్యులు కండ్లకుంట లక్ష్మినర్సిoహ్మచార్యుల ఆశీస్సులతో ఏర్పడినదే శ్రీ వివేకానంద సంస్కృతిక సమితి ఇది 1985 సంవత్సరంలో స్థాపించబడి 1987వ సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొంది 36 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతున్న సంస్థ.

 కృష్ణరాయ కళావేదిక నిర్మాణం:- జానపద కళారూపాలను కాపాడాలని ప్రోత్సహించాలనే ఆకాంక్ష తపనతో ఎందరో కళాభిమానులు ప్రాచీన కళలలో అనుభవం గల పెద్దలు తమంతట తాముగా తమ సమయాన్ని సూచనలను సలహాలతో పాటుగా ధనమును శ్రమను ధారపోసి కళామతల్లికి సేవ చేస్తూ ఈ సంస్థ ద్వారా పరిసర ప్రాంతాలలోని జానపద కళాకారులందరిని ఒకే వేదికపై పరిచయం చేసి వారి కళా రూపాలను వెలికి తీసి ప్రతిభను ప్రదర్శించుకోవడానికి నిర్మించిన వేదికే కృష్ణరాయ కళావేదిక. ఈ వేదికపై ఎస్ ఎం చారి, తెలంగాణ శకుంతల, డాక్టర్ ఐ కిషన్ రావు, వి రామకోటేశ్వరరావు, ఎస్ బి వి ఎం  ఎన్, ఆచార్య వనం లక్ష్మీకాంతరావు లాంటి కళా మేధావులను గౌరవించి, సన్మానించబడినవేదిక.
 శ్రీరామగిరి అనగానే గుర్తుకొచ్చేది శ్రీ రామ కళ్యాణం
శ్రీ వివేకానంద సంస్కృతి క సమితి ఏర్పాటు చేయబడిన ప్పటినుండి నేటి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూనే ఉంటుందని అందులో భాగంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభోగంగా నిర్వహిస్తామని శ్రీరామగిరి అనగానే శ్రీరామగిరి గుర్తుకు వచ్చేలా ఈ వేడుకలు ఉంటాయని. వివేకానంద సాంస్కృతిక సమితి  వ్యవస్థాపక సభ్యులు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదూరి కళాధర్ రాజు పెన్ పవర్ విలేఖరి తో ముచ్చటిస్తూ తెలిపారు. నివేదిత కళాభవన నిర్మాణం  పై కార్యక్రమాలన్నింటినీ జరుపుకోవడానికి కేంద్రబిందువుగా ఒక కళా భవనం ఉండాలని నిర్మించుకున్న మందిరమే నివేదిత కళాభవనం ఈ నిర్మాణానికి మానుకోట మాజీ శాసనసభ్యులు జెన్నా రెడ్డి జనార్దన్ రెడ్డి ఆర్థిక సహాయం చేశారని వారితో పాటుగా గ్రామంలోని ఉద్యోగస్తులు, గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు అందించారని ఆదూరి కళాధర్ రాజు తెలిపారు. 
ఇవే కాకుండా ప్రతి సంవత్సరం స్థానికులై నటువంటి డాక్టర్లను, ఇంజనీర్లను, ఉపాధ్యాయులను,సైన్యం, మరియు పోలీస్ విభాగాల వారి తో పాటుగా 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్,డిగ్రీ, యందు అత్యధిక మార్కులు సంపాదించుకున్న విద్యార్థులను సన్మానించడం జరుగుతుందని, విద్యార్థులకు దాతల సహకారంతో ఆర్ధిక సహాయమును అందించి వారి భవిష్యత్తుకు తగు సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికత, సమాజసేవలో పాలు పంచుకుంటూ జానపద కళా రూపాలను వెలికి తీస్తూ భారతదేశ పటంలో శ్రీ రామగిరి కి ఒక గుర్తింపు తెస్తూ... శ్రీ వివేకానంద సంస్కృత సమితి ప్రస్తుత అధ్యక్షులు బొమ్మిడి వినోద్ రెడ్డి, కోశాధికారి రామగిరి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ప్రజల మన్ననలను పొందుతున్నది అనడంలో సందేహం లేదు.డాక్టర్ ఆదూరి  కళాధర్ రాజు వివేకానంద సాంస్కృతిక సమితి ప్రధాన కార్యదర్శి, రాబోవు తరాలకు ఆస్తిపాస్తులు మేడలు మిద్దెలు పంచి ఇవ్వడం కాదు ఆత్మీయత అనురాగం అభిమానం ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అందించి సు లక్షణమైన ఉత్తమ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని  మా వివేకానంద సాంస్కృతిక సమితి ఆశయం. ఉత్తమ సమాజం ద్వారానే రాబోయే తరాలు ఉత్తమమైన సంస్కారాలు సద్గుణాలు పొంది సుఖశాంతులతో తమ జీవితాలు  విరజిల్లాలని ఈ పరంపర నిరాటంకంగా కొనసాగాలని. ఆకాంక్షిస్తూ.. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వివేకానంద సాంస్కృతిక సమితి శ్రీ రామగిరి. సర్వేజనా సుఖినోభవంతు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...