33వ వార్డు లో అవగాహన కార్యక్రమం
మహారాణి పేట, పెన్ పవర్
జీవీఎంసీ జోన్ 4, 33వ వార్డ్, గౌరి స్ట్రీట్ సచివాలయం పరిధిలో ప్రజలకు పారిశుధ్య పరిరక్షణ, ఫ్రైడే డ్రై డే కార్యక్రమం లో భాగంగా తమ ఇంటి పరిసరాలు, వాటర్ ట్యాంక్ లు శుభ్రం చేసుకొని దోమలు రాకుండా వ్యాధులు వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు సూచనలు చేశారు.స్థానికంగా ఉన్న ప్రజలతో కరోనా మళ్ళీ విజ్రంభిస్తున్న తరుణం లో అవగాహనా కార్యక్రమం నిర్వహించి భౌతిక దూరం పాటించాలని, ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల ను సంప్రదించాలని, విధిగా వేక్సిన్ వేయుంచుకొని ఆరోగ్యం గా ఉండాలని తగు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో వార్డ్ సెక్రటరీ పి.వి.కిరణ్ కుమార్,ఏ.ఆన్.ఏం.స్వయంవరపు లక్ష్మి, వి.ఆర్.ఓ రాజేష్, వాలంటీర్స్ నవీన్, ఆశ వర్కర్ పార్వతి తదితరులు పాల్గున్నారు.
No comments:
Post a Comment