32వ వార్డులో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
వనపర్తి, పెన్ పవర్వనపర్తిలోని 32వ వార్డులో మహిళ డిగ్రీ కాలేజి మెయిన్ రోడ్ లో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు.29వ వార్డు, 32వ వార్డులో కరెంటు సమస్య గురించి మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి, మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకపోవడం వల్ల సమస్య తీరిందని కౌన్సిలర్ నాగన్న యాదవ్ తెలిపారు. టౌన్ ఎ. ఈ. రాజగౌడ్ సహాయం చేశారని, 2 వార్డులకు కరెంటు సమస తగ్గి పోయిందని కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, గొర్ల కాపారుల జిల్లా చైర్మన్ పెండెం కురమూర్తి యాదవ్, కౌన్సిలర్ నక్క రాములు యాదవ్, వార్డు పెద్దలు చిలుక సత్యం సాగర్, ఏశామోని రాములు, రవిప్రకాశ్రెడ్డి, నరసింహులు కాంట్రాక్టు శివన్నాయదవ్ కరెంటు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment