ఇంటూరి హరిబాబు 3.10 లక్షలు వితరణ
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అధికారులు బ్లీచింగ్, సున్నం కావాలని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డిని కోరారు. దీంతో 20 టన్నుల బ్లీచింగ్ మొదటి విడతగా కందుకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కందుకూరు పురపాలక సంఘం కు స్థానిక శాసనసభ్యులు మహీధర్ రెడ్డి అందజేశారు. అయితే వీటికి 4.20 లక్షలు ఖర్చు అయిందని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తెలిపారు. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వలేటివారిపాలెం మండల జెడ్పిటిసి అభ్యర్థిని, బడేవారి పాలెం గ్రామ నివాసి ఇంటూరి భారతి, హరిబాబు దంపతులు బ్లీచింగ్ కు 2.10 లక్షలు స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి కి అందజేశారు. అంతేకాక నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పురపాలక సంఘం సున్నం కావాలని అధికారులు మహీధర్ రెడ్డి ని కోరగా లక్ష రూపాయలను హరిబాబు దంపతులు అందజేశారు. బ్లీచింగ్, సున్నం కలిపి 3.10 లక్షలు అందజేసి ఇంటూరి భారతి, హరిబాబు దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఇంటూరి హరిబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి స్పూర్తితో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తమ బాధ్యతగా సహాయం చేసినట్లు తెలిపారు. కరోనా మొదటి దశ నుండి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని ఉడతా భక్తిగా సహాయం చేసినట్లు తెలిపారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల లో బ్లీచింగ్ సున్నం అవసరమని అధికారులు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని అడగడంతో తమ వంతు బాధ్యతగా సహాయం చేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment