Followers

అభివృద్ధి పనులు మే 31 లోగా పూర్తిచేయాలి

 అభివృద్ధి పనులు మే 31 లోగా పూర్తిచేయాలి




రాజమహేంద్రవరం,పెన్ పవర్

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కమీషనర్ అభిషిక్త్ కిషోర్ నేడు పరిశీలించారు.. స్థానిక దేవి చౌక్, పుష్కర ఘాట్ లో జరుగుతున్న పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ మేజర్ పనులన్నీ మే 31 లోపు పూర్తి చేయాలన్నారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.ఇంజినీరింగ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ..ఎప్పటికప్పుడు తనకు నివేదిక అందచేయాలన్నారు.ప్రజలకు ట్రాఫిక్ అంతరయంలేకుండా చూడాలన్నారు.అనంతరం ఆర్ట్స్ కాలేజీ లో జరుగుతున్న పనులు,ఆవ రోడ్ లో జరుగుతున్న 100 అడుగుల రోడ్  పనులు,జాగృతి బ్లడ్ బాంక్ వద్ద జరుగుతున్న పనులు,ఎస్ బి ఐ కోలనీ వద్ద  80 అడుగుల రోడ్ నిర్మాణ పనులు ,అమృత్ పధకం లో జరుగుతున్న పనులను పరిశీలించారు.. ఉదయంనుండీ జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.ఈ ఓం ప్రకాష్,ఈ.ఈ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...