కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ 300 మందికి వేసిన డాక్టర్ రాజ్యలక్ష్మి....
మండలంలొని చాకిచెర్ల ప్రభుత్వ వైద్యశాల పరిధిలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం 300 మందికి రెండవడోస్ మొదలెట్టారు, చాకిచెర్ల గ్రామ పంచాయితీ పరిధిలోని 40 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది అలాగే రామాయపట్నం 70మందికి, భీమవరం 60 మందికి, బద్దిపూడి 30 మందికి, చాగొల్లు గ్రామ పంచాయతీలో 100 మందికి సెకండ్ డోస్ సిబ్బందితో కలసి వ్యాక్సిన్ వేయటం జరుగుతుందని డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ ఏ మేలు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment