కాణిపాకం హుండీ ఆదాయం 30 రోజులకు 79,01,689/- రూపాయలు ఆదాయం
కాణిపాకం, పెన్ పవర్
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక/స్వామి వారి దేవస్థానం వారు ఈరోజు 28-04-2021 వ తేదీ బుధవారం శ్రీ స్వామి వారి హుండీ లెక్కింపు ద్వారా 30 రోజులకు -79,01,689/- రూపాయలు భక్తుల నుంచి వివిధ కానుగుల ద్వారా లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశు తెలియజేశారు. ఈ హుండీ ఆదాయం లో
బంగారం-85.గ్రాములు.
వెండి- 900. గ్రాములు.
విదేశీ కరెన్సీ
యు ఎస్ ఏ- 381.డాలర్స్.
ఆస్ట్రేలియా - 20. డాలర్స్
యూరో - 110.యూరోస్.
ఇంగ్లాండ్ - 5. పౌన్స్
యూఏఈ- 10..దిర్హామ్స్
ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీ ఏ.వెంకటేశు తెలిపారు.
ఈ హుండీ లెక్కింపు లో పాల్గొన్నవారు, చిత్తూరు జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్- ఏకాంబరం, కాణిపాకం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ - కస్తూరి, ఏఈఓలు చిట్టెమ్మ, విద్యాసాగర్ రెడ్డి, చంద్రశేఖర్, సుధారాణి, సి ఎఫ్ ఓ-బి,యన్ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు - ప్రసాద్, శ్రీధర్ బాబు, కోదండపాణి, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment