2 లక్షల ఎల్.ఓ.సి ఇప్పించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, పెన్ పవర్
వనపర్తి పట్టణంలోని 33వ వార్డులోని దండు వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ కు ఆటో బోల్తా పడి ప్రమాదానికి గురై చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చేరారు. తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా నిరుపేద అయిన కార్మికుని ఆదుకోవాలని స్థానిక కౌన్సిలర్ ఉంగ్లం అలెక్య తిరుమల్ మెసేజ్ ద్వారా మంత్రి నిరంజన్ రెడ్డికి తెలిపారు. వెంటనే మంత్రి కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసి ఆపరేషన్ కు అవసరమైన ఆర్థిక సహాయం 2లక్షల ఎల్.ఓ.సిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంటనే మంజూరు అయిన ఎల్.ఓ.సి-లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీదర్, స్థానిక కౌన్సిలర్ ఉంగ్లం అలెఖ్య తిరుమల్ చేతుల మీదుగా అందజే శారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు టిఆర్ఎస్ నాయకులు బాలరాజు దండు శ్రీను పాల్గొన్నారు.కరోన సందర్భంగా కూడా మంత్రి ప్రజలకు సేవలు చేస్తున్నారని మాజీ కౌన్సిలర్ ఉంగలం తిరుమల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment