ఏప్రిల్ 26 దేశవ్యాప్త బందుని విజయవంతం చేయాలి
ఏప్రిల్ 26న దేశవ్యాప్తంగా చేపడుతున్న బందు ని విజయవంతం చేయాలని మావోయిస్ట్ అధికార ప్రతినిధి కైలాసం పేరుతో లేఖ విడుదలైంది. ఆదివాసీ మావోయిస్టు ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న నిర్బంధకాండ కు వ్యతిరేకంగా సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపుమేరకు ఈ బందు చేపడుతున్నట్లు కైలాసం లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ ఆంధ్రాలో జగన్ ఒడిశాలో నవీన్ పట్నాయక్ ల ప్రభుత్వాలు మావోయిస్ట్ ప్రజా ఉద్యమాపై ఉక్కుపాదం మోపుతున్నారని వీరి మోసపూరిత పాలనను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ లో ప్రహార్-3 పేరుతో ఆదివాసీల హక్కులు మావోయిస్టుల విప్లవోద్యమాల పై ప్రభుత్వాలు పాశవిక నిర్బంధకాండ అమలు చేస్తున్నారని వాటిని తిప్పి కొట్టడానికి పిలుపుమేరకు బంధు జరుగుతుందని ఈ బందును అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ఏ ఓ బి నాయకుడు పిలుపునిచ్చారు. ఏ ఓ బి కటాఫ్ ఏరియాలో తోట గోడ పనస పుట్టు సునాబెడ మో దిలీపడ కథం గూడాలలో పోలీస్ క్యాంపు ఏర్పాటు చేశారని ఆంధ్రాలో కోరుకొండ బోసు పుట్టు గిన్నెల కోట మద్ది గరువు జర్రెల సప్పర్ ల గాలికొండ ప్రాంతాల్లో అవుట్ పోస్ట్ లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వాటిని విరమించుకోవాలని లేఖలో సారాంశం. తోట గోడ నీలారం సెక్స్ ప్రాంతాల్లో జరిగిన ఫైరింగ్ లో పి ఎల్ జి ఏ ముగ్గురు కమాండర్లు అసువులు బాసి పేరని పొదిలి గూడా జడి గూడా రైతుని చంపేశారు. మజిలీ గూడా ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారం చేశారు.కూంబింగ్ పోలీసులు గిరిజనులపై క్రూరత్వం గా ప్రవర్తిస్తున్నారని ఈ చిత్రహింసలకు గురి చేస్తున్నారని వివరించారు. ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు పోలీసులు కృరత్వం గా వ్యవహరిస్తున్నారని ఆఖరికి ప్రభుత్వం నియమించిన వాలంటరీ లను సైతం వేధింపులకు గురి చేస్తున్నారని అందువల్ల బూద రాళ్ళలో 32 మంది వాలంటీర్లు రాజీనామా చేయడమే నిదర్శనం అని తెలిపారు. మన్యంలో బాక్సైట్ నిక్షేపాలు దోచుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారని వాటిని గిరిజన సంఘాలు ఉద్యమించక తప్పదు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న ద్వంద వైఖరి వ్యతిరేకించడంలో ఆదివాసీ గిరిజన హక్కుల పోరాట సంఘాలు మావోయిస్టు కమిటీల ఉద్యమాలు అణచివేత రోడ్ల నిర్మాణాలు ఇతరత్రా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు జరపతలపెట్టిన దేశవ్యాప్త బందును అన్ని వర్గాలు విజయవంతం చేయాలని మావోయిస్ట్ కమిటీ అధికార ప్రతినిధి కైలాసం లేఖ విడుదల చేశారు.
No comments:
Post a Comment