26వార్డు జగ్గారావు బ్రిడ్జ్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన కె.కె రాజు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
విశాఖ ఉత్తర నియోజకవర్గం 26వార్డు అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జ్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కె.కె రాజు యువసేన సునీల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని ముందుగా వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పులా మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం చలివేంద్రంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో 26వార్డు ఇంచార్జ్ పీలా వెంకటలక్ష్మీ,పోతు సత్యనారాయణ,కొణతాల రేవతిరావు,అమ్మాజీ, బి.గోవింద్,సింగలమ్మ, కె కె.రాజు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment