పాడేరు పోలీసులకు చిక్కిన 25 పల్సర్ బైకులు
ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
జిల్లాలో పల్సర్ బైక్ లను దొంగిలిస్తున్న దొంగలను పాడేరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 25 పల్సర్ బైకులు స్వాధీనం చేసుకుని దొంగలను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పాడేరు డి.ఎస్.పి రాజ్ కమల్ అందించిన వివరాల మేరకు శుక్రవారం పాడేరు ఎస్ఐ శ్రీనివాస రావు చింతలవీధి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. వారిని విచారించగా పల్సర్ బైక్ ల చోరీ వ్యవహారం వెలుగు చూసింది. చింతపల్లి మండలం పెద గొంది గ్రామంలో దాచి ఉంచిన 25 పల్సర్ బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో విశాఖ జిల్లాకు చెందిన 22 పల్సర్ బైకులు తూర్పుగోదావరి కి చెందిన 3 పల్సర్ బైకులు ఉన్నాయి. విశాఖ పాడేరు పెదబయలు చింతపల్లి రోలుగుంట కసింకోట గోలుగొండ కోటవురట్ల కు చెందిన బైకులు తూర్పుగోదావరి తుని రాజమండ్రి కోటనందూరు కి చెందిన బైకులు దొంగిలించ పడ్డాయి.
చింతపల్లి కి చెందిన బొమ్మిడి సురేష్ రాజుబాబులు జిల్లాలో వీలైన చోట్ల పల్సర్ బైక్ లను మారు తాళాలతో దొంగిలించి పెద గొంది గ్రామంలో రహస్యంగా దాచి ఉంచి వీలైన సమయం లో ఒడిశాకు తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఒడిశాలో పల్సర్ బైకు లకు మంచి గిరాకీ ఉండడంతో సురేష్ రాజుబాబులు పొలం పల్సర్ బైక్ లో చోరీకి మాత్రమే పాల్పడుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలన్నీ ఒకే కంపెనీకి చెందిన పల్సర్ బైకులు కావడం విశేషం. ఈ కేసును చేదించిన పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడం నాయుడు ఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బంది అప్పలరాజు తదితరులను డి ఎస్ పి రాజ్ కమల్ అభినందించారు.
No comments:
Post a Comment