Followers

సర్వేనెంబర్ 233/13 ప్రభుత్వ భూమిని కాపాడండి

 సర్వేనెంబర్ 233/13 ప్రభుత్వ భూమిని కాపాడండి.. 

ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడ..?కనిపించని ఆ అర ఎకరం భూమి ఆక్రమణ.. 

మరో 800 గజాల స్థలాన్ని చదునుచేసి ఆక్రమణకు సిద్దం..

గతంలో ఇదే కబ్జా భూమిలో అక్రమ నిర్మాణాన్ని.. దగ్గరుండి కూల్చి వేయించిన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్.. 

ఇందిరమ్మ కాలనీకి చెందాల్సిన ప్రభుత్వ స్థలాలు, అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోని అధికారులు 

ముందస్తుగా ఫిర్యాదు చేసిన పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు.. 

అధికారుల,ప్రజాప్రతినిధుల అండదండలతో  ఆక్రమణలు,అక్రమ నిర్మాణాలు..బీజేపీ.. 




కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు రోజువారి కబ్జాలు నిత్యకృత్యంగా తయారయ్యాయి.. మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరి, అధికారపార్టీ నాయకులకు వత్తాసు పలకడం వల్ల కార్పొరేషన్ పరిధిలో రోజుకో కబ్జా పర్వం వెలుగులోకి వస్తుంది. నిజాంపేట్ గ్రామంలో సర్వేనెంబర్ 233/13లో ప్రభుత్వ భూమి ఐదు ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో  దాదాపు రెండువేల గజాల స్థలం ఆక్రమించుకొని, భారీ భవన నిర్మాణం జరుగుతున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై బాజాపా నాయకులు తీవ్రంగా విమర్శించారు.. ఇదే అదనుగా భావించిన మరో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అనుచరులు దాదాపు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని జెసిబితో ఆదివారం చదును చేశారు..  గతంలో ఇందిరమ్మ కాలనీ అనుకొని ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి, బోర్లు వేసుకుని కాంపౌండ్ వాల్ నిర్మిస్తే,  కుత్బుల్లాపూర్ భాజపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ప్రజల ఫిర్యాదు మేరకు ఈ స్థలాన్ని సందర్శించి, అక్రమ నిర్మాణం కూల్చి వేయించి ప్రభుత్వ స్థలాన్ని  రక్షించారు కానీ , ప్రస్తుత అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కబ్జాలకు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందిస్తుందని బీజేపి నాయకులు ఆరోపించారు.. ఇదే స్థలాన్ని ఇప్పుడు మళ్ళీ ఆక్రమించుకుని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సహకారంతో నిర్మాణాలు ప్రారంభించడంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారా అని బిజెపి నాయకులు ప్రశ్నించారు..? ప్రభుత్వ భూములు పరిరక్షించాలని మేయర్, డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు ఆర్భాటంగా మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు కానీ, ప్రభుత్వ భూములు ఆక్రమణకు, కబ్జాకు గురైనప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం ఆగడాలకు? గత సంవత్సరకాలంగా బిజెపి నాయకులు కలెక్టర్ నుండి కమిషనర్ వరకు ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు రక్షించమని ఫిర్యాదు చేసిన, అధికారులు పెడచెవిన పెట్టడం వల్లనే ఈరోజు ప్రభుత్వ స్థలం మీద కబ్జా రాయుళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆక్రమణదారులకు ప్రత్యక్షంగా  ప్రజాప్రతినిధులు సహకరించడం వల్లనే వీరి ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని భాజపా నాయకులు విమర్శించారు.. ,ఇప్పటికైనా  రెవెన్యూ ,మున్సిపల్ అధికారులు ఈ సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిని సర్వే చేయించి, అందులోని అక్రమ నిర్మాణం కూల్చివేసి ,ప్రభుత్వ స్థలానికి పెన్సింగ్ వేసి బోర్డు పెట్టి పరిరక్షించాలని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఆక్రమణ దారులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కార్యవర్గ సభ్యులు ఏనుగుల నరసింహారెడ్డి, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర బాబు, సీనియర్ నాయకులు లక్ష్మణ్, కుమార్ గౌడ్ డివిజన్ ప్రెసిడెంట్ సురేష్ బాబు మరియు వినయ్, ప్రేమ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...