ఘనంగా సామ్రాట్ అశోక చక్రవర్తి 2325 వ జయంతి వేడుకలు
తొర్రూరు, పెన్ పవర్
మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద సామ్రాట్ అశోక చక్రవర్తి 2325 వ జయంతి సందర్భంగా మంగళవారం దళిత బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దళిత శక్తి తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు డొనుక ఐలయ్య అధ్యక్షత వహించగా,ముఖ్య అతిథులుగాతొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, దళితరత్న అవార్డు గ్రహీత గుండాల నర్సయ్య మరియు ఏడవ వార్డు కౌన్సిలర్ మాడుగుల నట్వర్ లు పాల్గొని, నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ...మౌర్య సామ్రాజ్యంను పరిపాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడు అని, ఇతను దాదాపు అన్ని భారత ఉపఖండాలను పరిపాలించి, పురాతన ఆసియాఅంతటా బౌద్ధమతం వ్యాప్తికి ప్రోత్సహించాడని, కొనియాడుతూ,కళింగ యుద్ధం తర్వాత అశోకుడు పూర్తిగా శాంతికాముకుడై బౌద్ధమతాన్ని అవలంభించడమే కాకుండా దాన్ని వ్యాప్తికి విశేష కృషి చేశాడని పేర్కొంటూ,ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదని, మరియు ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లే వారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాయి శెట్టి వెంకన్న,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వెల్తురి పూర్ణచందర్, సామాజిక కార్యకర్త మొహమ్మద్, అమీర్, తెలంగాణ మాదిగ జేఏసి రాష్ట్ర కార్యదర్శి రాయ్ శెట్టి ఉపేందర్, డొనుక రాజేశ్వరి మరియు బుడగ జంగాల యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment