21వ డివిజన్ జయశంకర్ కాలనీ లో బ్రాండన్ సపిడ్ షంవే సంస్థ ఆధ్వర్యంలో బోరు మోటర్ ప్రారంభం
పెన్ పవర్, జవహర్ నగర్
మునిసిపల్ కార్పోరేషన్ పరిధి 21డివిజన్ జయశంకర్ కాలనీ లో శనివారం బ్రాండన్ సపిడ్ షంవే సంస్థ వారు రావడం జరిగింది భూమా విజయ పౌల్ ఆధ్వర్యంలో బోర్ మోటర్ ను ముఖ్యఅతిథి డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. బ్రండన్ షంవే సంస్థ వారు కాలనీ వాసులకు కరోనా సెకండ్ వేవ్ గురించి అవగాహన కల్పించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అని సూచించారు. అందులో భాగంగానే తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్, సంతూర్ సబులు, ఇవన్నీ కలిసి ఒక కిట్టు రూపంలో ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మీరా మేడం ఊర్మిళ మేడం మేరి మేడం పాల్గొన్నారు. కాలనీ అధ్యక్షులు కృష్ణ యాదవ్, భూమా పౌల్, ముకుందన్, రూబెన్, నరేష్, జక్కుల భాస్కర్ ,కావ్య, సౌందర్య, అంజయ్య, పుల్లయ్య చారి లక్ష్మి తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment