Followers

కోవిడ్ నిబంధనల మధ్య టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 కోవిడ్ నిబంధనల మధ్య టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

ఇంద్రవెల్లి, పెన్ పవర్ 

టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ రాథోడ్ మోహన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27 న కేసిఆర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కొందరు నాయకులతో కలిసి తెరాస పార్టీని ఏర్పాటు చేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా అనేక పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.ప్రత్యేక రాష్ట్రం సాధించిన అనంతరం 2014 లో మొదటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఆయిన తర్వాత ప్రజల సంక్షేమమే దెయ్యంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన ఘనత తమ తెరాస పార్టీదని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న ఏకైక పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మెన్ మారుతి డోంగ్రే, జడ్పికోఆప్షన్ సభ్యుడు అంజద్, మాజీ మండల అధ్యక్షుడు సుఫియాన్, నాయకులు , దేవుపూజే మారుతి, నగేష్, కాళే శివాజీ, శ్రీనివాస్ , మహెష్ కదం, బాబుముండే తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...