Followers

గుమ్మ శిరగం పుట్టు వద్ద 2100 కిలోల గంజాయి పట్టివేత

 గుమ్మ శిరగం పుట్టు వద్ద 2100 కిలోల గంజాయి పట్టివేత
 మార్కెట్లో గంజాయి విలువ నాలుగు కోట్లు..

పెన్ పవర్, విశాఖపట్నం

 ఆంధ్ర ఒడిశా సరిహద్దు మండలం ముంచంగిపుట్టు లోని  గుమ్మ శిరగంపుట్టు  వద్ద 2100 కిలోల శీలవతి గంజాయి పట్టుబడింది. బొలెరో వాహనంలో  ఒడిశాకు రవాణా చేస్తుండగా పోలీసులకు చిక్కింది. వివరాలిలా ఉన్నాయి  ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో గంజాయి ప్యాకెట్ లో ఉన్న  మూటలు ఉండటాన్ని గుర్తించారు. వాహనం గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. శీలవతి  ఎండు గంజాయి తూకం  వేయగా  రెండువేల 100 కిలోలు  ఉంది.  ఇక్కడ దీని విలువ  కోటి రూపాయలు ఉంటుందని. అదే మార్కెట్లో అయితే నాలుగు కోట్ల వరకు గంజాయి విలువ  చేస్తుందని సీఐ అనిల్ కుమార్ తెలిపారు. గంజాయి రవాణా పై ప్రత్యేక నిఘా ఉంచామని పట్టుబడితే పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఈ  రైడ్ లో  ఎసిబి సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...