21వార్డ్ లో పర్యటించిన వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖ తూర్పు, పెన్ పవర్
వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం 21వార్డ్ లో పర్యటించారు.వార్డ్ పరిధిలో గల వివిధ సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయుటకు అవకాశాలను జీవీఎంసీ అధికారులతో కలసి వార్డులో పరిశీలించారు.వార్డులో డ్రైనేజీ, తాగునీరు, మొదలైన విషయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని కోరారు.
ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వార్డ్ లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరంచారు. చేపల మార్కెట్ అభివృద్ధి,పీతల వీధి నుంచి మెయిన్ రోడ్ కు రహదారి,యాదవ్ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ,రెళ్లివీధి కమ్యూనిటీ హాల్ నిర్మాణం, శెట్టిబలిజ, పద్మశాలి,ఒడియా బ్రహ్మిన్ మరియు వివిధ కమ్యూనిటీలకు భవనాల కొరకు వార్డ్ లో చేపట్టవలసిన కార్యక్రమాలకోసం చర్చించారు. కార్యక్రమంలో ఎ.ఈ.శిరీష జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment