20వ, డివిజన్ లో హైపోక్లోరైడ్ స్ప్రే చేయించిన కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్
రామగుండం, పెన్ పవర్
కోవిడ్-19 వైరస్ రెండవ దశలో భయంకరంగా అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రామగుండం పట్టణంలోని 20వ డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్ ఏరియాలో గల వివిధ కాలనీలలో స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ హైపోక్లోరైడ్ స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన వైరస్ సెకండ్ వేవ్ లో కరోన వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికి ప్రస్తుతం 20వ డివిజన్ ప్రజల సహాకారంతో డివిజన్ కరోన పాజిటివ్ నమోదులను కట్టడి చేయగలిగామని ప్రజలు కరోన వైరస్ ని ధైర్యంగా ఎదుర్కొకొవాలని ఎవరు కూడ భయపడవద్దని మున్సిపల్ వర్కర్స్ మరియు వైద్య సిబ్బంది సేవలు అసామాన్యమని మనమందరం కూడ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, కరోన వైరస్ ని ఎదుర్కుని దానిని అంతం మొందిద్దామని తన డివిజన్ ప్రజలకు ఆయన మనోధైర్యాన్ని నింపారు.
No comments:
Post a Comment