Followers

2వ రోజు రిలే నిరాహారదీక్షలు...

 2వ రోజు రిలే నిరాహారదీక్షలు...

మహారాణి పేట, పెన్ పవర్

2వ రోజు రిలే నిరాహారదీక్షలు. దేశానికి వెన్నుముక అయిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను తక్షణమే విరమించుకోవాలి. జెఎసి నాయకులు సిహెచ్ నర్సింగరావు.శనివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 2వ రోజు జరిగిన రిలే దీక్షలను ఉద్దేశించి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ లాభ నష్టాలతో సంబంధం లేకుండా దేశ సంపదను మొత్తం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అమ్మేయడం కోసం మోడీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అబద్ధాలు ఆడుతూ ప్రజలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పనులు చేస్తున్నదని అన్నారు. రైల్వేలు, స్టీల్ ప్లాంట్, బ్యాంకులు, ఎల్ఐసి వంటి ప్రజల సంపదను కార్పొరేట్ లకు అమ్మడాన్ని అడ్డుకుంటామని అన్నారు. 

బిజెపి ప్రభుత్వం దేశానికి శాపంగా మారిందని అన్నారు. ప్రజలు ఇలాంటి శాపాలను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలుసని అన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా దేశ సంపదను కాపాడుకుంటామని, మోడీ ప్రభుత్వం ఆటలు సాగనివ్వమని అన్నారు. ఈకార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు పడాల రమణ,ఎస్.ఎ. రెహమాన్,సిఐటియు నాయకులు భానుమూర్తి, ఒ.అప్పారావు,ఎన్ సింహాచలం డివైఎఫ్ఐ నాయకులు ఎస్ శ్రావణ్, కె.సురేష్,ఎస్ఎఫ్ఐ నాయకులు అప్పలరాజు,టిఎన్ టియుసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...