Followers

1వ వార్డు పర్యటనలో డాక్టర్ ఆకుల...

 1వ వార్డు పర్యటనలో డాక్టర్ ఆకుల... 

టిఫిన్ బండి నడుపుకునే మహిళకు 50వేలు సాయం..

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం నగరంలో వార్డులలో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి  తెలుసుకుని  పరిష్కరించడానికి రాజమహేంద్రవరం వైసీపీ నగర కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ పర్యటనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం  ఒకటవ వార్డు లాలాచెరువు ప్రాంతంలో డాక్టర్ ఆకుల పర్యటించారు. అయితే 1 వ వార్డులో  సమస్యలతో కూడిన ప్రాంతాలను పర్యటిసున్న సమయంలో  టిఫిన్ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న  గలగాని విజయలక్ష్మి తన సమస్యలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ కు వివరించారు.వ్యాపారం నడుపుకోవడానికి, పిల్లలను చదివించుకోవడానికి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని,  ఎక్కడా అప్పుదొరకడం లేదని ఆమె చెప్పారు.దీంతో స్పందించిన ఆకుల ఆమెకు యాభై వేల రుణ సాయం అక్కడికక్కడే  కల్పించారు. ఆమె అమ్మాయి బిటెక్ చదువుకు కూడా ఆర్ధిక సహాయం చేస్తానని  డాక్టర్ ఆకుల హామీ ఇచ్చారు.  తన వ్యాపారాభివృద్దికి ఆర్థికసాయం చేసిన డాక్టర్ ఆకుల సత్యనారాయణకు విజయలక్ష్మి కృతజ్నతలు తెలుపుకున్నారు. ఐఐటి, మెడిసిన్ విద్యార్ధుల పూర్తి చదువులకు ఆర్ధికసాయం చేసిన డాక్టర్ ఆకుల అలాగే మెడిసిన్, ఐఐటి ఉన్నత చదువులు చదివించుకోవడానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్ధులను చదివించడానికి మాజీ ఎమ్మెల్యే, రాజమండ్రి వైసీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ ముందుకు వచ్చారు. 

ఒక అపార్ట్ మెంట్ వద్ద వాచ్మెన్ గా పనిచేస్తున్న కుటుంబంలోని కన్న సందీప్ రాజ్ అనే విద్యార్ధికి ఖరగ్ పూర్ లో ఐఐటి బిటెక్ సీటు వచ్చింది. అయితే ఆ కుటుంబం ఆ అబ్బాయిని అక్కడ చదివించుకునే స్థోమత లేక అల్లాడుతున్న పరిస్థితి డాక్టర్ ఆకుల దృష్టికి వచ్చింది.  మావనతా దృక్ఫధంలో వెంటనే ఆ అబ్బాయి చదువుకు అయ్యే  ఖర్చు మొత్తం భరిస్తానని , ధైర్యంగా చదువుకునేందుకు పంపాలని తల్లిదండ్రులకు ఆకుల భరోసా ఇచ్చారు.అందుకు సంబంధించి  మొదటి విడతగా రెండు లక్షల రూపాయలను తన నివాసంలో  శుక్రవారం ఉదయం విద్యార్ధి కన్న సందీప్ రాజ్ కుటుంబసభ్యులకు డాక్టర్ ఆకుల  అందజేశారు. అదే విధంగా రాజమండ్రికి చెందిన మరో విద్యార్ధి సాయికి మెడిసిన్ సీటొచ్చింది. అయితే మెడిసిన్ చదివేందుకు ఆర్ధికంగా ఇబ్బందులు వుండటంతో ముందుకు వెళ్లాలా లేదా అనే సంశయంలో సాయి వున్నాడు.  ఈ విద్యార్ధి విషయం  కూడా డాక్టర్ ఆకుల సత్యనారాయణ దృష్టికి రావడంతో సాయి మెడిసిన్ కు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు లక్ష న్నర రూపాయల ఆర్థిక సహాయం గా సాయి, వారి కుటుంబసభ్యులకు డాక్టర్ ఆకుల అందజేశారు. ఆ విద్యార్దుల కుటుంబ సభ్యులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ చేసిన విద్యాదానానికి హృదయపూర్వక కృతజ్నతలు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...