Followers

కోవిడ్-19 నిబంధనలు అనుసరించి శ్రీ నూకాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఏర్పాట్లు జరగాలి

 కోవిడ్-19 నిబంధనలు అనుసరించి శ్రీ నూకాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఏర్పాట్లు జరగాలి

పెద్దాపురం, పెన్ పవర్ 

 పెద్దాపురం మండలంలోని కాండ్రకోట గ్రామంలో 45 రోజుల పాటు  జరగనున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం కోవిడ్-19 నిబంధనలు అనుసరించి ఏర్పాట్లు చేయాలని సమీక్ష సమావేశం  నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ ఎస్. మల్లి బాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి పెరుగుతున్న కారణంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి వేలాది సంఖ్యలో విచ్చేయునున్న ప్రజాలందరుకు తగిన ఏర్పాట్లు చేయాలని పలు శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి పారిశుధ్యం, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని,తాత్కాలిక టాయిలెట్స్, డ్రమ్ములు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని పంచాయితీ కార్యదర్శికు తెలియజేసారు.వైద్య ఆరోగ్య శాఖ కు సంబంధించి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని,108 సర్వీస్ అందుబాటులో ఉంచాలని డి యమ్ అండ్ హెచ్ ఓ ను కోరారు. నీటిపారుదల శాఖ కు సంబంధించి జాతర మహోత్సవం ను తిలకించుటకు వచ్చేభక్తులుఏలేరుకాలువలోస్నానాదులుకావించేందుకు,నీటిఉధృత తగ్గించాలని, అదేవిధంగా స్నానాలరేవు నిర్మాణం చేపట్టవసిందిగా కోరారు. వేసవికాలంలో ఎటువంటి విద్యుత్తు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ ఏ.ఈకు సూచించారు.

అగ్నిమాపక శాఖకు సంబంధించి ముందస్తు చర్యలలో భాగంగా ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా దేవాదాయశాఖ ఏ.డిను కోవిడ్-19 నిబంధనలు అనుగుణంగా భక్తులందరూ సామాజిక దూరం, శానిటేషన్, మాస్కులు ధరించి త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంతరాలు లేకుండా చేయాలని, జాతర మహోత్సవం ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరారు.అడిషనల్ డి.యమ్ అండ్ హెచ్.ఓ డా. సరిత మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ అమ్మ వారి జాతర మహోత్సవంలో కోవిడ్ నియంత్రణ కు ప్రజలందరూ మాస్కులు, సామాజిక దూరం, శానిటేషన్ చేయాలని, వేసవికాలంలో ఎండల తివ్రత ఎక్కువ ఉన్నందున పిల్లలు కు మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఆలయ ప్రాంగణంలో  భక్తులకు అర్ధమయ్యే విధంగా కోవిడ్-19 గురించి ఆరోగ్య సూత్రాలు, పాంఫ్లెట్స్ లో కరోనా గురించి చిత్ర పాటలతో అవగాహన కలిగేవిధంగా తెలియజేయాలని కోరారు.ఈ సమావేశంలో సర్పంచ్ ఎం. శ్రీనివాస్, వైస్ సర్పంచ్ జె.పద్మనాభం, దేవస్థానం ఈవో భవాని ఎలక్ట్రికల్ ఏ.ఈ ఎస్. ఈశ్వరప్రసాద్, ఇరిగేషన్ ఏ. ఈ.ఈ పి. వీరబాబు, మెడికల్ పి హెచ్ సి లు సి.హెచ్ ఎం. ధనలక్ష్మి, ఏ. అనూష, పంచాయతీ కార్యదర్శి వి. రాజంబాబు, వీఆర్వో లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...