Followers

కోవిడ్-19 ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి

కోవిడ్-19 ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి 

చిత్తూరు, పెన్ పవర్

చిత్తూరు నగరంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ సూపర్వైజరీ అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు.  నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... నగరంలో ప్రతిరోజూ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని... కరోనా వైరస్ తీవ్రతపై ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో వలంటీర్లను సమన్వయం చేసుకొని వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలన్నారు. ఇదే సమయంలో పాజిటివ్ నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా మార్చి కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టులను పక్కా గుర్తించి వారిని హోంక్వారంటైన్ లో ఉంచి పరీక్షలు నిర్వహించాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్వో ఆనిల్ కుమార్, ఏఎస్వో నరసింహ, సూపర్వైజరీ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...