Followers

కోవిడ్ 19పై అవగాహన శిక్షణ

 కోవిడ్ 19పై అవగాహన శిక్షణ

మెంటాడ ,పెన్ పవర్  

మెంటాడ మండలం లోని గురువారము సర్పంచులకు, వార్డు నెంబర్లకు, గ్రామ వాలంటీర్లకు, గ్రీన్ నెంబర్స్ మెంట్ కు కోవిడ్ 19 ఒకరోజు అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మెంటాడ లో కరోనా తీవ్రంగా ఉందని, ఈ శిక్షణా కార్యక్రమాన్ని మెంటాడ మండలం లోని చల్లపేట జడ్పీ హైస్కూల్ లో నిర్వహించారు. కరోనాపై అవగాహన కల్పించడానికి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, గ్రామ వాలంటీర్లకు అధికారులు పిలుపునిచ్చారు. అవగాహన సదస్సు కు పెద్దగా ఏ ఒక్కరూ ఆసక్తి చూపించక పోవడంతో కొంతమంది సర్పంచులు, వార్డు సభ్యులు పెద్దగా హాజరు కాలేదు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారి వాణిశ్రీ మాట్లాడుతూ కరోనా చాలా తీవ్రంగా ఉందని, గౌరవ సర్పంచులు, వార్డ్ నెంబర్లు గ్రామాల్లో కరోనా పై అవగాహన కల్పించాలని కోరారు. కరోనా టీక ప్రతి ఒక్కరూ వేసుకోవాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...