భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కోవిడ్ 19 సహాయ కేంద్రం ఏర్పాటు
తాండూర్, పెన్ పవర్మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో యువ మోర్చా మండల అధ్యక్షులు చజనాల రాహుల్ ఆధ్వర్యంలో కోవిడ్ 19 వాక్సిన్ సహాయక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్, జిల్లా కార్యదర్శి ఏముర్ల ప్రదీప్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణి చేస్తున్న కరోనా టీకా గురించి ప్రజలకు అవగాహన కల్పించి, కరోనా టీకా తీసుకోవడం కోసం ఆరోగ్య సేతు అప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించడం జరిగిందని అన్నారు.ప్రజలు ఎలాంటి అపోహ పడకుండా కోవిడ్ 19 వాక్సిన్ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి వినోద్,బీజేపీ మండల అధ్యక్షులు రామగోని మహీదర్ గౌడ్, మండల ఇంచార్జి రెవెల్లి రాయలింగు,అసెంబ్లీ నాయకులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, మండల్ ప్రధాన కార్యదర్శి విష్ణు, భరత్,జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్, మండల ఉపాధ్యక్షులు పుట్ట కుమార్,సీనియర్ నాయకులు తుకారాం,మహిళా మోర్చా అధ్యక్షురాలు సీతాలు యువ మోర్చా నాయకులు గాయత్రి, పులి సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment